విజయ్ కీలక నిర్ణయం.. జ్యోతిష్కుడు రాధా పండిట్ నియామకం రద్దు
13-05-2026 03:15 PM
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళగ వెట్రి కజగం (TVK) కూటమి భాగస్వాముల, ప్రత్యర్థుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి తన ఆస్థాన జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను(Rickey Radhan Pandit Vettrivel) ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విధి అధికారి (OSD)గా నియమించడాన్ని రద్దు చేశారు.
వెట్రివేల్ ముఖ్యమంత్రి విభాగంలో ఓఎస్డీ (Officer on Special Duty)గా పదోన్నతి పొందిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK), సీపీఐఎం, సీపీఐ వంటి పార్టీలు ఈ చర్యను బహిరంగంగా విమర్శించడంతో, తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.






