27 August, 2026 | 6:53 PM

మండల కాంగ్రెస్ కమిటీ నియామకం

27-08-2026 05:50 PM

* 21 మందితో మండల కమిటీ ఏర్పాటు 

* ఉత్తర్వులు జారీ చేసిన డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్జెల రాజు ఆధ్వర్యంలో 21 మందితో కూడిన ముస్తాబాద్ మండల కమిటీని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని ఆశావాహులకు అధిష్టానం భవిష్యత్ భరోసా కల్పిస్తుందని మండల అధ్యక్షుడు గజ్జెల రాజు మాట్లాడారు.

పార్టీ జెండాను విడవకుండా క్రమశిక్షణతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. పని చేసే ప్రతీ ఒక్కరికీ గుర్తింపు లభిస్తుందన్నారు. ఆశావాహులకు భవిష్యత్తులో అధిష్టానం అండగా ఉంటుందని ఎవరు నిరుత్సాహ పడవద్దని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

ఈ కమిటీకి సహకరించిన జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నూతన కమిటీ వివరాలు తెలియజేశారు. మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కర్ణాకర్,మల్లేష్ ప్రధాన కార్యదర్శులు రామిరెడ్డి, ఆంజనేయులు,జంగ రాజు,  ఎల్లం, కార్యదర్శులు శ్రీలత, రమేష్,శంకర్,రాజు, కరుణాకర్, కార్యవర్గ సభ్యులు హరీష్,స్వప్న, కొండయ్య,మహేష్,శ్రీనివాస్, భాగ్య,యాదమ్మ,శంకరయ్య, సుగుణ లను అభినందించారు.