జానంపేటలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం
పొనుగోటి కామేశ్వరరావు బహిష్కరణ!
పినపాక ఆగస్టు 27, (విజయక్రాంతి): పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించాల్సిన ,పార్టీకి వెన్నుపోటు పొడిచిన పొనుగోటి కామేశ్వరరావుతో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అడహక్ కమిటీ స్పష్టం చేసింది. అతన్ని పార్టీ నుంచి పుష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
ఈ మేరకు జానంపేట బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇటీవల జరిగిన జానంపేట గ్రామపంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి పొనుగోటి కామేశ్వరరావు ప్రధాన కారణమని పార్టీ గ్రామ కమిటీ నిర్ధారించింది. ప్రజలలో నమ్మకం కోల్పోయి, పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను గుర్తించారు.






