మెట్ పల్లి మున్సిపల్ లో అభివృద్ధి పనులకు ఆమోదం
మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్ పల్లి పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం కౌన్సిల్ సాధారణ సమావేశం లో పలు అభివృద్ధి పనులకు పాలక వర్గం ఆమోదం తెలిపింది. చైర్మన్ మైలారపు లింబాద్రి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇరవై తొమ్మిది అంశాలను పొందుపరచగా ఆ అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు.
అనంతరం కౌన్సిల్ సభ్యులు అన్ని వార్డులలో సి.సి. రోడ్లను వెంటనే నిర్మించాలని కోరగా అందుకు చైర్మన్ మాట్లాడుతూ... దశలవారీగా సి.సి రోడ్ల నిర్మాణం చేపడతామని పట్టణ అభివృద్ధి తమ ద్యేయం అని అన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి,వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, మున్సిపల్ కమిషనర్ డి. శ్రీనివాస్ గౌడ్, డి. ఇ.ఇ నాగేశ్వరరావు, మేనేజర్ వెంకటలక్ష్మి, టి.పి.ఓ రాజేంద్రప్రసాద్, ఆర్.ఓ. మిర్జా అజ్మతుల్లా బేగ్,జె.ఎ.ఓ రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, కౌన్సిలర్స్,సిబ్బంది పాల్గోన్నారు.






