3 August, 2026 | 5:11 PM

నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి

03-08-2026 04:38 PM

మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

ప్రజాదివాస్ కు 15 ఫిర్యాదులు

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 15 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును ఎస్పీ శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ప్రజలకు మరింత చేరువగా ఉండి శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు.