తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం
భిక్కనూర్,(విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లోని యూనివర్సిటీ లైబ్రరీకి పీజీ విద్యార్థులు, నెట్, సెట్, సీఎస్‌ఐఆర్-నెట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉపయోగపడే పుస్తకాలను అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రమాదేవి అందజేశారు. ప్రిన్సిపల్ డా. సుధాకర్ గౌడ్ చేతుల మీదుగా లైబ్రేరియన్ శ్రీకాంత్ కు పుస్తకాలను అందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రయోజనం కోసం డా. రమాదేవి తన సొంత ఖర్చుతో పుస్తకాలు కొనుగోలు చేసి అందించడం అభినందనీయమన్నారు. కొత్త సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డా. రమాదేవి తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. రాజేశ్వరి, డా. సునీత, డా. అంజయ్య, డా. సరిత పిట్ల, డా. ఎస్. నారాయణ, డా. నర్సయ్య, డా. సంతోష్ గౌడ్, డా. వెంకటరెడ్డి, డా. అఫ్రీన్, డా. కనకయ్య, డా. పోతన్న, డా. విజయ్, డా. మహిపాల్, డా. సునీల్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.






