calender_icon.png 21 February, 2026 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల వేతన తిప్పలు పట్టవా!

13-02-2026 12:00:00 AM

డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ :

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ కమిషన్ నివేదిక సమర్పణ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2023 అక్టోబరు 2న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి ఇప్పటికీ సమర్పించలేదు. 

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగడం వెనుక ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకం. పరిపాలనలో భా గంగా భారత రాజ్యాంగంలోని పార్ట్ 14వ భాగంలోని 309, 315 ఆర్టికల్స్ ప్రకారం ఉద్యోగుల నియామకం గురించి వివరిస్తూనే వారికి కొన్ని రక్షణలు కల్పించింది. అయితే ఉద్యోగులు సంతృప్తిగా, గౌరవంగా ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అం దించగలరు. ప్రభుత్వ వనరులను నిరుపేదలకు, అర్హులకు సక్రమంగా పంపిణీ చేయడ మే ప్రభుత్వ ఉద్యోగి ప్రాథమిక విధి.

ప్రతి ఉద్యోగి తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (1996) వంటి నిబంధనల ప్రకారం విధులను నిర్వర్తించాలి. ప్రతి ఉద్యోగి అవినీతికి తావులేకుండా ప్రజలకు సేవలందించాలి. ప్రభుత్వం రూపొందించిన పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులే కీలకపాత్ర పోషిస్తారు. అందుకే ప్రభుత్వం వారి జీతభత్యాలు, పెన్షన్లు, సంక్షేమంపై దృష్టి పెట్టడం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది సుపరిపాలనకు అవసరం. సమాచార హక్కు చట్టం ప్రభుత్వ శాఖల పనితీరు  ప్రశ్నించే హక్కును కల్పిస్తుంది. 

న్యాయ పోరాటాలు..

తెలంగాణలో సుమారు 3.9 లక్షల మం ది ఉద్యోగులుంటే వారిలో ప్రతి నెలా దాదా పు 800 నుంచి వెయ్యి మంది రిటైర్ అవుతున్నారు. ఒక్కొక్కరికి జీపీఎఫ్, సరెండర్ లీవులు తదితరాల కింద రూ.35 నుంచి 70 లక్షల దాకా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కు ఏటా రూ.4 వేల కోట్ల పైచిలుకు రిటైర్మెంట్ బెనిఫిట్ల కింద చెల్లించాల్సి ఉంటుం ది. తెలంగాణ రాష్ర్టంలో విద్యాశాఖలో ఉపాధ్యాయులు  సుమారుగా 1.12 లక్షల నుంచి 1.15 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

కొత్తజీవో తీయకుండానే పాత జీవో 25 ప్రకారం పాఠశాలలు రేషనలైజ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ స్కూల్స్ వందల కొద్దీ మూసివేశారు. గతంలో విద్యాశాఖకు ఆరు నుంచి ఏడు శాతం బడ్జెట్  ఉన్నది. ఈ సంవత్సరం విద్యాశాఖకు బడ్జెట్‌ను 16 శాతం పెంచాలని ఉద్యోగ సంఘాలు డి మాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతోంది, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోటు ఫలితంగా ఉద్యోగులు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నా రు. వీరికి ఉద్యోగ విరమణ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది. 

పదవీ విరమణ చేసిన 45 రోజుల్లో మొ త్తం సొమ్ము చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం చెప్పిన ప్రభుత్వ  తీరులో మార్పు రాకపోవడం విచారకరం. తమ జీతాల నుం చి దాచుకున్న జీపీఎఫ్ డబ్బు కూడా ఇవ్వకపోవడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నా రు. ఫలితంగా విశ్రాంత ఉద్యోగులు, అధికారులు అవస్థ ఎదుర్కొంటున్నా రు. ఏడాది కాలంలో 8 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే వారిలో ఏ ఒక్కరికీ ప్రయోజనాలు అందకపోవడం విచారకరం. జీవిత కాలం ప్రభుత్వ సేవలో గడిపి చివరికి రిటైర్మెంట్ సొమ్ముల కోసం ఇప్పటికీ న్యాయ పోరాటాలు, వీధి పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టకరమని చెప్పవచ్చు.

పెరుగుతున్న అసంతృప్తి..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి ఏడాది దాటినా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి తగ్గడం లేదు. సీఎం రే వంత్ 2023 చివర్లో అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ వర్గాలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాయి. దశాబ్ద కాలంగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాకపోవడం, దీనికి తోడు గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సుమారు 5 నుంచి 6 పెండింగ్ డీఏలు ఉన్నాయి. వీటి కోసం ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

కొత్త పీఆర్సీ నివేదిక అమలు, దానికి సంబంధించిన బకాయిల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఉద్యోగులకు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందడం లేదు. హెల్త్ కార్డులను కార్పొరేట్ ఆస్పత్రులు తిరస్కరిస్తున్నాయి. ఆర్టీసీలో 2017 నుంచి వేతన సవరణ జరగకపోవడం వల్ల బకాయిలు రాక 295 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఒక నివేదికలో పేర్కొన్నారు. రిటైరైన ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తం రూ.11 వేల కోట్లు అని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి.

ప్రభుత్వం అరకొరగా నెలకు రూ.700 కోట్లు పెండింగ్ బిల్లు లను మంజూరు చేస్తున్నది. ఈ మొత్తాన్ని నెలకు రూ.1,500 కోట్లకు పెంచాలని ఉద్యో గ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు సకాలంలో అందకపోవడంతో ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురై దాదాపు 27 నుంచి 32 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులు ఆత్మహ త్య చేసుకున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. పెన్షనర్లు చనిపోతున్నా వారి బకా యిలు చెల్లించకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోతున్నది. దీంతో ‘ఉద్యోగ గర్జన’ వంటి నిరసనలకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. 

అప్రమత్తత అవసరం..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ కమిషన్ నివేదిక సమర్పణ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2023 అక్టోబరు 2న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్ నే తృత్వంలోని ఏర్పాటైప కమిటీ తన నివేదికను ఇంకా ప్రభుత్వానికి అధికారికంగా సమర్పించలే దు. ఆ ఏడాది జూలై నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లోకి రావాల్సిన వేతన సవర ణల కోసం తగిన సిఫార్సులు ఇవ్వాలని ఈ కమిషన్‌ను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఆరు నెలల గడువు విధించినా వరుస పొడిగింపులతో నేటికీ కొనసాగుతూనే ఉన్నది. 51 శాతం ఫిట్‌మెంట్ కావాలని కమిషన్‌ను కోరగా, ప్రభుత్వం కేవలం ఐదు శాతం మధ్యంతర భృతిని ప్రకటించి పీఆర్సీని ఆలస్యం చేయడం సమంజసం కాదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోయిది.

గతేడాది నుంచి ఇప్పటివరకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడలేదు. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా ఏపీ నుంచి రెండువేల మంది ఉద్యోగులను రప్పించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ ఉద్యోగుల్లో తెలంగాణకు వస్తున్నవారే ఉన్నారు తప్ప వెళ్తున్నవారు కనిపిం చడం లేదు. ఇప్పటికైనా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది.

 వ్యాసకర్త సెల్: 9177566741