13-02-2026 12:00:00 AM
పుల్లెంల గణేష్ :
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలం లో విడుదల చేసిన నివేదికలో భారతదేశంలో చెత్త ఏరుకునే వారి లో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారే అధికంగా ఉన్నట్లు తేలింది. ఇందు లో అగ్రకులాల వాటా కేవలం 10 శాతం మాత్రమే అని నివేదిక పేర్కొంది. అయితే ఈ నివేదిక ఒక గణాంక సమాచారం మా త్రమే కాదు. ఇది భారత సమాజంలోని కులాధారిత శ్రమ విభజన, సామాజిక అన్యాయం, ఆర్థిక అసమానతలను చూపిస్తున్నది. అయితే ఈ వాస్తవం మనలో ఒక ముఖ్యమైన ప్రశ్నను రేకెత్తిస్తున్నది.
స్వాతం త్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇం కా అగ్రకులాల ఆధిపత్యమే ఎందుకు కొనసాగుతున్నది. ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరముంది. నిజానికి చెత్త ఏరుకోవడం శ్రమ కాదు, బలవంతపు సామాజిక విధిగా మార్చబడిందని చెప్పొ చ్చు. రాజ్యాంగానికి ముందున్న మనుస్మృతి వంటి గ్రంథాలు కొన్ని కులాలకు అపవిత్రమైన పనులను కేటాయించింది. అందుకే పారిశుద్ధ్య పనుల్లో, చెత్త ఏరుకోవడంలో అధికంగా దళితులు, వెనుకబడి న వర్గాలు, గిరిజనులే కనిపిస్తారు.
ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు, వ్యవస్థాపిత అణచివేత ఫలితం. అయితే డాక్టర్ బీఆర్ అం బేద్కర్ అన్ని వర్గాల్లో సమానత్వం, సౌబ్రాతత్వం ఉండే విధంగా భారత రాజ్యాం గాన్ని రూపొందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అం దరూ సమానం, ఆర్టికల్ 15 ప్రకారం కుల వివక్ష నిషేధం, ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, ఆర్టికల్ 17 ప్ర కారం అస్పృశ్యత నిర్మూలన, ఆర్టికల్ 19 ప్రకారం అభిప్రాయ స్వేచ్ఛ, ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రద జీవితం, రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతిని ధ్యం అనేవి దేశంలోని అందరి హక్కులను గుర్తుచేస్తాయని గ్రహించాలి.
ఐక్యతతోనే సాధ్యం..
మరి స్వాతంత్రానంతరం ఎందుకు అ గ్రకులాల ఆధిపత్యం కొనసాగుతుంది అని విశ్లేషించి చూస్తే.. వారసత్వం, ఆధిప త్యం, భూములు, విద్య, ధనం, భాషా ప్రావీణ్యం, పరిపాలనా అనుభవం ఇవన్నీ స్వాతంత్య్రానికి మునుపే అగ్రకులాల చేతుల్లోనే ఇమిడి ఉన్నాయి. ఇదే సమయంలో సామాజిక వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సరైన చదువు లేకపోవడం, రాజకీయ చైతన్యంపై అవగాహన లేకపోవడం, ఆర్థికంగా బలహీనులవ్వడం చేత వీరు వెనుకబడిపోవడానికి కారణాలుగా నిలిచాయి.
బ్రాహ్మ ణీయ సంస్కృతి, ఆధిపత్యం, విద్యా సంస్థ లు, మత వ్యవస్థలన్నీ అగ్రకుల భావజాలాన్ని బాగా ప్రచారం చేశాయి. ‘ఓటు హ క్కు రాజకీయ ప్రజాస్వామ్యానికి మూలాధారం’ అని అంబేద్కర్ మాటలు గుర్తుం చుకోవాలి. భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జనాభా 85 శాతానికి పైగా ఉంది. కానీ అధికారాన్ని మాత్రం 10 నుంచి 15 శాతమున్న అగ్రకులాలే అనుభవిస్తున్నాయి.
అట్టడుగు కులాలకు రాజ్యా ధికారం సాధ్యమవ్వాలంటే ముందు అగ్రకులాలు ఆశచూపే మందు, మాంసం, డ బ్బు ప్రలోభాలకు గురయ్యి ఓట్లను అ మ్ముకోవడం మానుకోవాలి. పూలే, అంబేద్కర్, కాన్షీరాం ఆలోచనలను ఆచరణలో పెడుతూ బహుజన కులాలు స్వధర్మంతో స్వశక్తిగా, పీడిత కులాల స్వీయ రాజకీయ పార్టీల ఐక్యత ద్వారానే స్వరాజ్య సాధన సాధ్యమవుతుందని గ్రహించాలి.
సమాన హోదా కల్పించాలి..
అయితే చెత్త ఏరుకునే సమూహాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారే అధికంగా ఉన్నాయని ప్రభుత్వాలు పేర్కొంటున్నా యి. మరి దీనిని నిర్మూలించాలన్నప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ద్వారా ప్రభుత్వాలే బలమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరముంది. యంత్రాల ద్వారా పారిశు ధ్యం చేయడం, చెత్త ఏరుకునే వారికి శాశ్వ త పునరావాసం ఏర్పాటు, శాశ్వత ఉద్యోగాలను ప్రభుత్వాలే కల్పించాలి.
విద్యలో సమానత్వ చట్టం, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రభుత్వాలు తమ నియ ంత్రణలోకి తీసుకోవాలి. రాజకీయ ప్రాతిని ధ్య విస్తరణను బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్‌లో ఎస్సీ,ఎస్టీ, బీసీ ఉపకోటా జనాభా దామాషా ప్రకారం పెంచాలి.
కుల, మత ద్వేషాన్ని నేరంగా పరిగణించేలా, రాజ్యాంగ విలువల బోధన తప్పని సరి చేస్తూ ప్రైమరీ స్థాయి నుండి డిగ్రీ, పీజీ వరకు కోర్సులకు అతీతంగా రాజ్యాం గ అక్షరాస్యతను భారతీయ పౌరులకు సంక్షిప్తంగా వివరించాలి. కులం, మతం, ప్రాంతం, లింగం ఏదైనా చట్టం ముందు అందరూ సమానమని గుర్తించుకోవాలి. అసమానతలను తొలగిస్తూ అవకాశాల్లో సమానం, గౌరవంలో సమాన హోదా కల్పించినప్పుడే రాజ్యాధికారం సిద్ధించినట్లవుతుందని గ్రహించాలి.
రిజర్వేషన్లు ఎందుకంటే?
ఆధునిక భారతదేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను తప్పుపడుతూ నైపుణ్యం ఆధారంగానే ఉద్యోగాలు ఉండాలన్న అగ్రకులా లు ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరముంది. తరతరాలుగా హిందూ కుల వ్యవస్థలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అగ్ర కులాల చేత అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక గౌరవం కల్పించి ప్రోత్సా హకాలు అందించడానికే రాజ్యాంగ బద్ధం గా.. విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు వచ్చాయి.
అంతేకానీ ఆయా కులాలను ఆర్థికంగా బలవంతులను చేసేందుకు కాద ని గ్రహించాలి. అయితే ఇప్పటికీ రాజ్యాధికారం, భూమి, వ్యాపారం, సమస్త రంగాల్లో ఆధిపత్యం అగ్రకులాలదే అయినప్పటికీ రిజర్వేషన్ వ్యవస్థను తప్పుబడు తూనే వస్తున్నారు. అలా అయితే భారతదేశ పారిశుధ్య విభాగంలో పనిచేసే వారి లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే మెజార్టీగా ఉన్నారు. ఇందులో కూడా అగ్రకులాలు సమానా వాటా దక్కాలన్నప్పుడు తమకు పారిశుద్ధ విబాగంలోనూ రిజర్వేషన్లు ఉండాలని ఎందుకు ఉద్యమించరనే దానిపై సమాధానం చెప్పాలి.
నిజానికి మన దేశంలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే వారిని సామాజికంగా చిన్నచూపు చూస్తారు. కానీ విదేశాల్లో మాత్రం పారిశుద్ధ్య కార్మికులని గౌరవంగా చూస్తూ గొప్పదనాన్ని చాటుకుంటారు. కానీ మన దేశంలో మాత్రం పారిశుద్ధ్య కార్మికులను అంటరాని వారిగా చూస్తూ అవమానించడం జరుగుతున్నది. ఇలాంటి అసమానతలు తొలగించినప్పుడే దేశంలో అందరికీ సమాన హక్కు లు, హోదా లభిస్తాయనడంలో సందేహం లేదు.
అప్పుడే రాజ్యాధికారం..
మన భారతదేశం పూర్వం జంబూద్వీప గణరాజ్యంగా ఉన్నప్పుడు, జాంబవంతుడి పాలనలో సమాజంలో ఎలాంటి కుల, మ త, లింగ, వర్ణ భేదాలు లేకుండా మనుషులందరూ స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావ ప్రజాస్వామ్యం, గణతంత్ర విలువలతో జీవించారని నానుడి. రాజ్యంలో ఉన్న సహజ వనరులను ప్రతి ఒక్కరికి సమానంగా, సమస్త రంగాల్లో సమాన వాట ఉండేలా స్వర్ణ యుగ పాలనతో , ఆదర్శ పాలనతో ఆనాటి జంబుద్వీపం రాజ్యం కొనసాగినట్లు చరిత్ర చెబుతుంది.
ఆనాటి జంబుద్వీప సమానత్వ విలువలను బుద్ధు డు బోధించాడు, వాటిని సామ్రాట్ అశోక మహారాజ్ తన రాజ్యంలో అమలు చేశా డు. ఆ జంబుద్వీప జాంబవంతుడి సమానత్వ విలువలే విదేశాలకు విస్తరించి, నేడు స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావ విలువలకి తాము రూపకర్తలుగా చెప్పుకుంటున్నారు. కానీ నేటి భారతదేశ పాలకులు మాత్రం అసమానతలకు తావిస్తూ ఆధిపత్య ధోరణితో పాలన చేస్తూ వ్యక్తులను, వ్యవస్థల నూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఈ విధానాన్ని వీడి మన పాలకులు కుల, మత, లింగ, వర్ణ, ప్రాంత భేదాలు లేకుం డా స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావ విలువలతో రాజ్యాధికారంలోను, భూమిలోను, వ్యాపారాల్లో.. ఇలా సమస్త రంగాల్లో ప్రతి పౌరుడికి సమాన హక్కులు పొందేలా రాజ్యపాలన చేయాల్సిన అవసరం ఎంతై నా ఉందని మన అధికారులు గుర్తించాలి. ఈ విషయాన్ని మేధావులు, విద్యావంతులు, సామాన్యులు సైతం గ్రహించి నప్పుడే దేశంలో అసమానతలు తొలిగిపోయి నిజమైన రాజ్యాధికారం సిద్ధిస్తుం దని ఆశించవచ్చు.
వ్యాసకర్త సెల్: 9553041549