6 March, 2026 | 1:23 AM

14 ఏళ్లుగా 150 పట్టాల కోసం ఆరేపల్లి గ్రామ భూనిర్వాసితుల ఎదురుచూపులు

06-03-2026 12:03 AM

ఐదు నెలలు గడిచినా ఆర్డీవో స్పందించడం లేదని ఆవేదన

రాజన్న సిరిసిల్ల, మార్చి 5 (విజయ క్రాంతి): జిల్లాలోని వేములవాడ అర్బన్ మండలం పరిధిలోని ఆరేపల్లి మిడ్మానేరు నిర్వాసిత గ్రామ ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు.చూస్తున్నా. ఆరేపల్లి గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందాల్సి ఉన్నప్పటికీ, ఐదు నెలలు గడిచినా సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిడ్మానేరు ప్రాజెక్ట్ కారణంగా ఆరెపల్లి గ్రామ నిర్వాసితులకు 2011 సంవత్సరంలో ప్రభుత్వం ఆర్ & ఆర్ పట్టాలు, 2013 సంవత్సరంలో ఆ స్థలాల్లో 12సంవత్సరాలనుండి ఉంటున్నట్లుగా ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ సంకెపల్లి శివారులో ఇవ్వడం జరిగింది. కానీ రుద్రవరం గ్రామస్తులకు అక్కడ స్థలం సరిపోక ఆరెపల్లి గ్రామానికి కేటాయించిన ఇళ్ల స్థలాలను ఇచ్చారు. తర్వాత ఆరెపల్లి గ్రామానికి చింతల్ తానా గ్రామంలో ఇస్తామని నేటి వరకు ఇవ్వలేదు.ఈ విషయమై ఆర్ & ఆర్ కమిషనర్ హైదరాబాద్ ఆరెపల్లి గ్రామస్తులు దరఖాస్తు చేయగా విచారణ జరిపి నివేదిక పంపించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కోరారు.

జిల్లా కలెక్టర్ వేములవాడ ఆర్డీవో కోరినట్లు తెలిపారు. అయితే, పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఆర్డీవో ఎంక్వయిరీ రిపోర్ట్ రాసి పంపడం లేదని గ్రామ నిర్వాసితుడు గడ్డం నరేష్. గ్రామ ప్రజలు ఆరోపించారు. సమస్యను త్వరగా పరిష్కరించి పట్టాలు మంజూరు చేసి ఆర్థిక సాయం విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలు చేస్తామని ఆరెపల్లి గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.