6 March, 2026 | 1:22 AM

రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులు సింఘ్వీ, నరేందర్ రెడ్డిలకు కవ్వంపల్లి అభినందనలు

06-03-2026 12:01 AM

మానకొండూరు, మార్చి 5 (విజయ క్రాంతి)తెలంగాణ నుంచిరాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఖరారైన సిటింగ్ ఎంపీఅభిషేక్ మనుసింఘ్వీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. గురువారం వారు హైదరాబాదులో నామినేషన్లు దాఖలు చేయగా, ఈ కార్యక్రమంలోనూ రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులతో కలిసి డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.