వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం
12-06-2024 12:10 AM
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం జూన్ 10న చెన్నులోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ హాస్యనటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి వివాహ వేడుక జూన్ 7న హల్ది కార్యక్రమంతో మొదలైంది. కాగా 10వ తేదీన ఉదయం జరిగిన ఈ వివాహ మహోత్సవానికి తమిళ చిత్ర సీమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 14న చెన్నై లోని లీలా ప్యాలెస్‌లో రిషెప్షన్ జరుగనుంది.






