16 July, 2026 | 8:45 PM

జూలైలో రానున్న రాయన్

12-06-2024 12:10 AM

కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. సందీప్ కిషన్, ఎస్‌జే సూర్య, కాళిదాస్ జయరాం, సెల్వ రాఘవన్, ప్రకాశ్ రాజ్, దుషార విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మొదట ఈ సినిమాను జూన్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ప్రకటించిన మేకర్స్, తాజాగా చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. జూలై 26న విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్; కెమెరా: ఓం ప్రకాశ్. ధనుష్ నటించిన 50వ చిత్రం కావటంతో ‘రాయన్’పై అభిమానులలో భారీ అంచనాలున్నాయి. ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్నాడు.