లోయలో పడ్డ ఆర్మీ వాహనం
- ఐదురుగు సైనికులు మృతి
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘటన
శ్రీనగర్, డిసెంబర్ 24: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 11 మద్రాస్ లైట్ ఇన్‌ఫ్రాంటీ(11ఎంఎల్‌ఐ)కి చెందిన వాహ నం మంగళవారం పూంచ్ జిల్లాలోని హెడ్‌క్వార్టర్స్ నుంచి బాల్నోయి ఘోరా పోస్ట్‌కు వెళ్తుండగా అదుపుతప్పి 350 అడుగుల లోతు గల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం తెలసిన వెంటనే 11ఎంఎల్‌ఐకు చెందిన క్విక్ రియాక్షన్ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యల ను ప్రారంభించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అం దిస్తున్నారు. ఇలాంటి ప్రమాదమే నవంబర్ 4న కూడా చోటు చేసుకుంది. రాజౌరీ జిల్లాలోని బడాగ్ ప్రాంతంలో సైనిక వాహనం లోయలో పడటంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.






