ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ ఎంపిక అశాస్త్రీయం
ఏఐసీసీ జాతీయ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: జాతీయ మాన వ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జిస్టి స్ వి.రామసుబ్రమణియన్ ఎంపికలో కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయత పాటించలేదని, ఎంపిక లోపభూయిష్ఠంగా ఉందని మంగళవారం ఏఐసీసీ జాతీయ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. దేశ సమగ్రత, భద్రత, న్యాయసేవల వంటి కీలకమైన అంశాల్లో కేంద్రం పరస్పర సంప్రదింపులు, ఏకాభిప్రా య సాధన వంటి సంప్రదాయాలను విస్మరిస్తున్నదని ఆరోపించింది.
చట్టసభల్లో ప్రతి పక్షాలు లేవనెత్తిన డిమాండ్లను పక్కన పెట్టి, తమకు నచ్చిన వారికి పదవి కట్టబెట్టేందుకు సంఖ్యాపరమైన మెజార్టీపై ఆధారపడుతున్నదని విమర్శించింది. ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా వి.రామసుబ్రమణియన్, సభ్యులుగా ప్రి యాంక కానుంగో, జస్టిస్ బిద్యుత్‌రంజన్ షడంగి నియామకంపై ఈ నెల 18న ప్రధాని నరేంద్రమ మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. సమావేశ నిర్వహణపై ఏఐసీసీ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది.






