15 April, 2026 | 12:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాష్ట్ర గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

20-12-2025 06:46 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 23వ తేదీనవనపర్తి జిల్లా పర్యటనకు వస్తున్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 23వ తేదీన గవర్నర్ పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన 3.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ముఖాముఖీలో పాల్గొంటారని, అలాంటి వారిని గుర్తించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖులను ఆహ్వానించాలని ఆర్డీవోకు సూచించారు. ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, డయాస్, సౌండ్ సిస్టం, కరెంట్ సరఫరా తదితరవి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశించారు. జిల్లా ప్రొఫైల్ తో పాటు వివిధ రంగాల్లో జిల్లా సాధించిన అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిఆర్డిఓ ఉమాదేవి, డీఎంహెచ్వో సాయినాథ్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.