20-12-2025 07:11:08 PM
జిల్లా పాలనాధికారి ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల సెటిల్‌మెంట్ కోసం ప్రత్యేక ప్రచారం “మీ డబ్బు – మీ హక్కు” ఈ ప్రచారంలో భాగంగా శనివారం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని సమావేశం మందిరంలో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ప్రత్యేక అవగాహన , సేవల శిబిరం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక సేవల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం 01.10.2025 నుండి 31.12.2025 వరకు జాతీయ స్థాయి ప్రచారం నిర్వహించబడుతోందనీ “మీ డబ్బు – మీ హక్కు” అనే నినాదంతో జరుగుతున్న ఈ ప్రచారం ద్వారా, పౌరులు తమకు చెందవలసిన అన్ క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా రాబడులు మొదలైన ఆర్థిక ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించబడుతుందని అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అన్‌క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులపై హక్కు కలిగిన వారు అవసరమైన పత్రాలతో సంబంధిత బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను సంప్రదించి తమ నిధులను తిరిగి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. అలాగే, RBI ఆధ్వర్యంలోని UDGAM పోర్టల్ ను వినియోగించి అన్‌క్లెయిమ్ డిపాజిట్ల వివరాలను తెలుసుకొని సులభంగా సెటిల్‌మెంట్ పొందవచ్చని తెలిపారు. ప్రత్యేక ప్రచారాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో S. ప్రవీణ్ కుమార్, DDM NABARD, అనుపమ, GM – NDCC బ్యాంక్, మనీష్ సైనీ, DM కెనరా బ్యాంక్, J. చంద్రశేఖర్, LDM – కామారెడ్డి, అలాగే SBI, SLBC తెలంగాణ తరఫున DM వరప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. శిబిరంలో నాబార్డు, ఎస్‌ఎల్‌బీసీ, ఎల్‌ఐసీ, వివిధ బ్యాంకుల అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు. పాల్గొన్న సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు అందించాయి. ఈ సందర్భంగా నిజమైన హక్కుదారులకు సెటిల్‌మెంట్ లెటర్లు కూడా జారీ చేయబడ్డాయి.