30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

17-03-2026 08:33 PM

నంగునూరు,(విజయక్రాంతి): నంగునూరు మండలం నర్మెట్ట లో 22న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.హేమావతి మంగళవారం పరిశీలించారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో హెలిప్యాడ్,బహిరంగ సభా వేదిక, రైతు మేళా స్టాళ్ల ఏర్పాటును వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, విజయ ఎం.డి చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి ఆమె పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పర్యటనలో ప్రోటోకాల్ పాటిస్తూ, ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు మేళాకు వచ్చే వేలాది మంది రైతులకు తాగునీరు, ఇతర కనీస వసతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగు, యాంత్రీకరణ, పాడి పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించేలా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్, ఉద్యానవన, పోలీస్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు పాల్గొన్నారు.