30 June, 2026 | 10:37 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

గడువు ముగిసిన పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసిన వ్యక్తి అస్వస్థత

17-03-2026 08:28 PM

ఉప్పల్,(విజయక్రాంతి): గడువు ముగిసిన పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసిన వ్యక్తి త్రీవ అస్వస్థతకు గురైన  సంఘటన  ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ అశోక్ నగర్ లో చోటుచేసుకుంది. గడువు ముగిసిన పెరుగువిక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న మిల్క్ బూత్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వివరాల్లోకెళ్తే  అశోక్ నగర్లో నివాసం ఉంటున్న గజేందర్  అశోక్ నగర్ లోని ఓ మిల్క్ షాప్ లో పెరుగును కొనుగోలు చేశారు.

తర్వాత ఇంటికెళ్లి పెరుగుతో భోజనం చేసిన తర్వాత వాంతులు విరోచనాలతో  కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు దగ్గరలోఉన్న ఆసుపత్రికి తరలించగా గడువు  ముగిసిన పెరుగు తాగడం వల్లనే గజేందర్ అస్వస్థత గురైనట్టు డాక్టర్లు తెలియజేశారు. పదేపదే గడువు ముగిసిన పాల ప్యాకెట్లు పెరుగు విక్రయిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అశోక్ నగర్ ప్రాంతంలోని నిత్యం కల్తి పాల పెరుగు అమ్మకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వలన పాల బూతు యజమాన్యం విచ్చలవిడిగా గడువు పూర్తయినా కూడా పాలు పెరుగు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే పాల బూత్ నుండి పాలు పెరుగు కొనుగోలు చేసిన పలువురు అస్వస్థతకు  గురైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి పాల బూతులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.