1 April, 2026 | 2:34 AM

మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

01-04-2026 12:30 AM

సివిల్ సప్లై మేనేజర్ సుగుణబాయి 

మేడ్చల్, మార్చి 31 (విజయక్రాంతి): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని రేషన్ కార్డు దారులకు మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ఎల్. సుగుణ బాయి తెలిపారు.

జిల్లాకు సంబంధించి 6,45,442 రేషన్ కార్డులలో నమోదైన 22,17,063 లబ్దిదారులకు, ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున మూడు నెలలకు అవసరమైన మొత్తం 39,360,154 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు. జిల్లాలోని 6 ఎంఎల్‌ఎస్ (MLS) పాయింట్ల ద్వారా బియ్యాన్ని ఫెయిర్ ప్రైస్ షాపులకు సరఫరా చేసి, అక్కడి నుండి లబ్దిదారులకు సకాలంలో పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు.

లబ్దిదారులు ఏప్రిల్ 1వ తేదీ నుండి తమకు సంబంధించిన ఫెయిర్ ప్రెస్ షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పొందవచ్చని తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్ వివరాలతో హాజరై బియ్యాన్ని సులభంగా పొందాలని సూచించారు.పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా అక్రమాలు, అదనపు వసూళ్లు లేదా ఇతర సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.