హాస్టళ్ల సందర్శన పనిష్మెంట్ గా భావించొద్దు
13-07-2026 03:05 PM
- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.
నాగర్ కర్నూల్ ( విజయక్రాంతి ): జిల్లాలోని బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ సందర్శన కొరకు కేటాయించిన జిల్లా స్థాయి అధికారులు పనిష్మెంట్ గా భావించద్దని హాస్టల్లోని మౌలిక వసతులు సమస్యలు పరిష్కారం కోసం విధిగా సందర్శించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ అన్నారు. సందర్శించిన వాటి వివరాలు ఫోటోలను ఆన్లైన్లో పొందుపరచాలని సమస్యల పరిష్కారం కొరకు నివేదిక ఇవ్వాలన్నారు. సోమవారం ప్రజావాణి హాల్లో ప్రజావాణి అనంతరం హాస్టల్ సందర్శించిన అధికారులతో మాట్లాడారు.






