7 May, 2026 | 11:54 AM

బండి సంజయ్ పర్యటన వేళ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

07-05-2026 11:23 AM

తంగళ్ళపల్లి మే 07( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన సందర్భంగా గురువారం బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు.

బండి సంజయ్ పర్యటనకు వస్తే ముందస్తుగా తమను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో పడిగేలా రాజు, ఫ్యాక్స్ చైర్మన్ దేవదాసు, అంకుసాపూర్ మాజీ సర్పంచ్ అడ్డగట్ల భాస్కర్, సురభి నవీన్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.