7 May, 2026 | 12:19 PM

కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

07-05-2026 11:47 AM

బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్నందుకే గుండు అయింది

బండి సంజయ్ పంచినది అవినీతి డబ్బా.. రేవంత్ పంపిన డబ్బా?

బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు

హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్( Bandi Sanjay)పై హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ లో మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.... కేటీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. ''మీకు దమ్ముంటే రండి.. ఏ అంశంపై అయినా చర్చకు మేం రెడీ'' అన్నారు.

తంబాకులో డ్రగ్స్ కలిపి తినడం వల్లే బండి సంజయ్ కి బట్టతల వచ్చిందని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే మేమూ మాట్లాడతామన్నారు. ''నువ్వుమగాడివైతే అని మేమూ అనగలం'' అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశానని బండి సంజయ్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 కోట్లు ఎలా ఖర్చుపెట్టారు?, బండి సంజయ్ పంచినది అవినీతి డబ్బా.. రేవంత్ పంపిన డబ్బా? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.