గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్

12-09-2026 | 10:46am

చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ పట్టణ(Chennur town) సమీపంలోని 63వ జాతీయ రహదారిపై టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు యువకులు గంజాయితో పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 1 కిలో 20 గ్రాముల గంజాయితో పాటు సెల్‌ఫోన్‌, రూ.2 వేల నగదు, నంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌, ఏటీఎం కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.15 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

సీఐ బన్సీలాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై(National Highway) తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో మహారాష్ట్ర నుంచి వేములవాడకు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను అనుమానంతో ఆపి తనిఖీ చేయగా  వారి వద్ద గంజాయి లభించడంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణలో మహారాష్ట్రలోని తొడ్స గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా రూ.4 వేలతో గంజాయిని కొనుగోలు చేసి వేములవాడకు తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు  తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని  నిందితులపై కేసు నమోదు చేసి  కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.

మరిన్ని వార్తలు