గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్ట్
ఆర్మూర్,(విజయక్రాంతి): గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు అర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. సోమవారం అర్మూర్ మండలం అంకాపూర్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిజాంబాద్ వైపు నుండి పల్సర్ మోటార్ సైకిల్ పై ముగ్గురు వ్యక్తులు రాగా పోలీసు వారు వారిని ఆపే ప్రయత్నం చేయగా వారు బండిని వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు.
వారిని ముగ్గురిని పట్టుకొని తనిఖీ చేయగా పల్సర్ మోటార్ సైకిల్ లో చిన్న చిన్న 20 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. అర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామానికి చెందిన ఆకుల అజయ్, జక్రాంపల్లి మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన అభిలాష్, మహారాష్ట నాందేడ్ కు చెందిన మహమ్మద్ అనే యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సిఐ పేర్కొన్నారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా వ్యక్తులు గంజాయి విక్రయించినా, గంజాయి తాగిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.






