3 August, 2026 | 9:45 PM

Breaking News

తల్లి బిడ్డల క్షేమమే ఐసిడిఎస్ లక్ష్యం

03-08-2026 09:11 PM

ఐసిడిఎస్ సిడిపిఓ కమల ప్రియ

సత్తుపల్లి,(విజయక్రాంతి): తల్లి బిడ్డల క్షేమమే ఐసిడిఎస్ లక్ష్యం అని, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు  పట్టించాలని సిడిపిఓ చావా కమల ప్రియ అన్నారు. చింతకాని మండల పరిధిలోని నేరెడ 1 అంగన్వాడీ కేంద్రంలో చింతకాని సెక్టార్ సూపర్వైజర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో కమల ప్రియ మాట్లాడుతూ... తల్లిపాలు తాగిన పిల్లల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని చురుకుదనంగా ఉంటారని అన్నారు. తల్లిపాలతో సమానమైన పోషక విలువలు కలిగిన ఆహారం మరొకటి లేదు అన్నారు.

గర్భిణీగా గుర్తించిన దగ్గర్నుంచి పోషక విలువలు కలిగిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని, పోషకాహార లోపం కలిగితే రక్తహీనత సమస్యతో పాటు పుట్టిన బిడ్డకు అవసరమైనన్ని పాలు అందించే అవకాశం ఉండదని, సుఖ ప్రసవం కష్టమవుతుందని అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా ర్యాలీలల, గృహ సందర్శనల,  సమావేశాల ద్వారా , అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తల్లులకు ,కుటుంబ సభ్యులకు చైతన్య పరుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైద్యులు ఎస్.కె సోయర్ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు చిన్నారులకు అందించే వ్యాధి నిరోధక టీకాలు గురించి వివరించారు.