త్రాగునీటి సమస్య లేకుండా చూస్తాం
03-08-2026 09:14 PM
మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): త్రాగునీటి సమస్యలు లేకుండా ప్రజలందరికీ త్రాగునీరు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోనీ 8వ వార్డులో ప్రజలకు త్రాగునీటి కొరత ఉండొద్దని దృష్టిలో పెట్టుకొని 2 హ్యాండ్ బోర్లు కౌన్సిల్ సభ్యులతో కలిసి ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో కమీషనర్ టి రమేష్ , స్థానిక కౌన్సిలర్ చింతల రాజు , కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,






