30 June, 2026 | 11:53 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బీపీ నియంత్రణ ఇలా!

17-05-2024 12:10 AM

‘వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్’ చొరవతో 2005లో ప్రారంభమై ప్రతి ఏటా మే 17న ‘ప్రపంచ రక్తపోటు దినం’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ‘ప్రపంచ రక్తపో టు దినం - సందర్భంగా ‘రక్తపోటును కొలుచుకో, నియంత్రించు, దీర్ఘకాలం జీవించు’ అన్నది నినాదంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.13 బిలియన్లకు పైగా ప్రజలు అధిక రక్తపోటు (హైపర్టె న్షన్ లేదా బ్లడ్ ప్రెజర్) రుగ్మతతో బాధ ప డుతున్నట్టు ఒక అధికారిక అంచనా.  విశ్వవ్యాప్తంగా మూడింట రెండు వంతుల అల్ప, మధ్యస్థ ఆదాయ దేశాల ప్రజలు రక్తపోటు తో సతమతమవుతున్నారు. దాదాపు 10 శాతం ప్రజలు బీపీ సమస్యతో బాధపడుతున్నారని, 2025 నాటికి 25 శాతం ప్రజలకు బీపీ తగ్గించే/ నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నామని ‘ఐరాస’ అంటున్నది. 

ఉచిత పరీక్షలతో అవగాహన

‘ప్రపంచ బీపీ దినం’ సందర్భంగా ఉచిత రక్తపోటు నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఈ రుగ్మతపట్ల అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. సాధారణంగా 140/90 వరకు బీపీ ఉన్నపుడు నియంత్రించవచ్చు. ఆరోగ్యవంతుల బీపీ 120/80 ఉండాలని మనకు తెలుసు. రక్తపోటు అధికమైనపుడు తీవ్ర గుండె సమస్యలతో కూడిన అనారోగ్యాలు కలుగుతాయి. ప్రపంచ మరణాల్లో 12.8 శాతం బీపీ సం బంధ సమస్యలతో జరిగినవే అని తేలింది. ‘ప్రపంచ రక్తపోటు దినం’ అవగాహన వేదికలు జనాలను భయపెట్టి, మానసిక ఒత్తిడి పెంచేవి కాదని, ఈ రోజున బీపీ సమస్యకు సంబంధించిన లోతైన విషయ పరిజ్ఞానం అందించడం జరుగుతుందని నమ్మాలి. బీపీని నిర్లక్ష్యం చేసినపుడు గుండెపోటు, కిడ్నీ సమస్యలు, హార్ట్ ఫెయుల్యూర్, చూపు మందగించడం, స్ట్రోకులు లాంటి ప్రాణాపాయ స్థితులు కూడా రావచ్చని తెలుసు కోవాలి. నేడు భారతదేశంలో మూడింట ఒక వంతు ప్రజలకు బీపీ సమస్య ఉంది.  పురుషుల కన్నా మహిళల్లో అధికంగా ఉండటాన్ని నిపుణులు గమనించారు. పట్టణ ప్రజల్లో 40 శాతం వరకు, గ్రామీణుల్లో 17 శాతం వరకు ఉన్నట్లు నిర్ధారించారు.

2016 గణాంకాల ప్రకారం రక్తపోటు కారణంగా 1.63 మిలియన్ల మరణాలు నమోదైనాయి. 18- మధ్య వయస్కుల్లో కూడా 10 శాతం మందికి బీపీ సమస్య ఉండడం విచారకరం. హృదయనాళ సంబంధ రుగ్మతగా బీపీని ‘సైలెంట్ కిల్లర్’గా పిలుస్తారు. వయస్సు 60 దాటిన వయోజనులకు బీపీ సమస్యలు అధికంగా కనిపి స్తున్నాయి. భారత్‌లో రక్తపోటు రుగ్మతతో 80 మిలియన్ల ప్రజలు అంటే ప్రతి ఐదుగురిలో ఒక వయోజనుడు (19 శాతం) ఈ రుగ్మతతో బాధ పడుతున్నారు. వీరిలో 15 శాతం చికిత్స తీసుకోవడం, 49 శాతం నియంత్రించ లేని స్థితిలో ఉన్నారని తేలింది.  ప్రతి ఏటా ఇండియాలో దాదాపు 10 మిలియన్ల మరణాలు బీపీ సంబంధ కారణాలతో జరుగుతున్నట్టు అంచనా. ఇది అంటువ్యాధి కాదని, మన అలవాట్లతో నివారించి, నియంత్రించ వచ్చని అందరూ తెలుసుకోవాలి. బీపీ రాకుండా పరిపూర్ణమైన జీవనశైలిని పాటించగలిగితే సరి.

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి 

సెల్: 9949700037