ఔషధ పరిశోధనలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర
ఘట్ కేసర్, జూన్ 12 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర శాఖ సహకారంతో నిర్వహించిన ఎమర్జింగ్ రూల్స్, స్ట్రాటేజిగ్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇన్ నాచురల్ ప్రొడకట్స్ డ్రగ్ డిస్కవరీ డిస్కవరీ అనే అంశంపై ఏఎన్‌ఆర్‌ఎఫ్ ప్రాయో జిత ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శుక్రవారం విజయవంతంగా ముగిసింది.
వాలెడిక్టరీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ సైంటిస్ట్, నేచురల్ ప్రొడకట్స్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ విభాగం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ డాక్టర్ కె. నాగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔషధ పరిశోధనలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తోందని, భవిష్యత్ ఔషధ ఆవిష్కరణలో ఆధారిత పరిశోధనలకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫార్మాస్యూటికల్ సైన్సెస్, డేటా సైన్స్, కంప్యూటేషనల్ బయాలజీ మధ్య అంతరశాఖ సహకారం అవసరమని సూచించారు.
ఐదు రోజుల కార్యక్రమంకు తెలంగాణతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ ఫార్మసీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి మొత్తం 60 మంది అధ్యాపకులు, పరిశోధకులు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ మోహన్ చిన్నాల, డాక్టర్ బి. వసుధ భక్షి, డీన్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ జి. బాబా శంకర్ రావు, డాక్టర్ ఎం. రామ్ మోహన్, కో-కన్వీనర్, డాక్టర్ కాంతలం చామకూర పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా పాల్గొ న్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.






