calender_icon.png 19 February, 2026 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ట్స్ కళాశాల విద్యార్థి ఖో ఖో జాతీయ జట్టుకు ఎంపిక

19-02-2026 05:40:50 PM

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో జీ. దినేష్ జాతీయ స్థాయి ఖోఖో జట్టుకు ఎంపిక కావడం గర్వకారణం, తెలంగాణ రాష్ట్రం తరఫున దినేష్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. 17 ఫిబ్రవరి నుండి 9 మార్చి వరకు గుజరాత్ గాంధీనగర్‌లో భారత క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ శిక్షణ శిబిరంలో దినేష్ పాల్గొననున్నాడు.

దేశవ్యాప్తంగా ఎంపికైన ప్రతిభావంతులైన క్రీడాకారులతో కలిసి ఉన్నత స్థాయి సాధన చేయనున్నాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, దినేష్‌ను అభినందిస్తూ, మాట్లాడుతూ  ఆర్ట్స్ కళాశాల విద్యార్థి జాతీయ జట్టుకు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు. దినేష్ క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన, భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలని ఆశిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఏటిబిటి ప్రసాద్, గిరి ప్రసాద్, ప్రసాద్  క్రీడా విభాగం సిబ్బంది, సహ విద్యార్థులు పాల్గొన్నారు.