గచ్చిబౌలి AMB ఫ్లైఓవర్‌పై స్కూటీని ఢీకొట్టిన బుల్లెట్.. ఇద్దరు స్పాట్ డెడ్
26-06-2026 12:17 PM
హైదరాబాద్: గచ్చిబౌలిలో ఉన్న AMB ఫ్లైఓవర్‌పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం, హైదరాబాద్ గచ్చిబౌలి ఏఎంబీ ఫ్లైఓవర్ రహదారిపై రాంగ్ సైడ్‌లో వస్తున్న స్కూటీని బుల్లెట్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, విఠల్ అనే బాధితులు అక్కడికక్కడే మరణించారు. ఉదయం 7:25 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బుల్లెట్ బైక్ నడుపుతున్న మూడవ వ్యక్తి వినోద్ తీవ్రంగా గాయపడటంతో, అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.






