26 June, 2026 | 1:27 PM

'గోల్డ్ మ్యాన్' సూర్యభాయ్ అరెస్ట్

26-06-2026 12:30 PM

హైదరాబాద్:  మార్కెట్ ధర కంటే విదేశాల నుంచి తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారం తెప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసిన పాతబస్తీలో "గోల్డ్ మ్యాన్"గా ప్రసిద్ధి చెందిన సూర్య భాయ్‌ను(Gold Man Surya Bhai arrested) అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు గోల్డ్ మ్యాన్ సూర్యభాయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ రూ. 30 లక్షల మోసం చేశాడని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి, హైదరాబాద్ సీపీకి సన్నహితుడినంటూ నమ్మించాడని బాధితులు వాపోయారు. బంగారం ఇవ్వకపోవడంతో డబ్బుల కోసం బాధితులు సూర్యభాయ్ ఇంటికి వెళ్లారు. దీంతో సూర్యభాయ్ 3 ఐఫోన్లు , రూ. 20 లక్షల చెక్కు ఇచ్చాడు. అనంతరం బెదిరించి ఫోన్లు తీసుకెళ్లారంటూ బాధితులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నారాయణగూడ పీఎస్ కు పోలీసులు బదిలీ చేశారు.