26 June, 2026 | 1:27 PM

జార్ఖండ్‌లో ట్రక్కు, వ్యాన్ ఢీ: ఏడుగురు మృతి

26-06-2026 12:43 PM

రామ్‌గఢ్: జార్ఖండ్‌లోని(Jharkhand) రామ్‌గఢ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గు లోడుతో వెళ్తున్న ఒక ట్రక్కు, బ్యాండ్ పార్టీ సభ్యులతో వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టడంతో కనీసం ఏడుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కుజు ఓపీ ప్రాంతం సమీపంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు బాధితులు ఒక వివాహ వేడుకలో ప్రదర్శన ఇచ్చి తిరిగి వస్తున్నట్లు సమాచారం. నలిగిపోయిన వాహనంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అత్యవసర సహాయక బృందాలు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వాహనంలోని ఏడుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో అతివేగం లేదా డ్రైవర్ తప్పిదం వల్లే జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటన తర్వాత స్థానికులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. రాజ్రప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్లోంగ్ బుధ్‌బజార్ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఒక ట్రక్కు వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించడం పట్ల ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.