భరత్ నగర్‌లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ
తంగళ్ళపల్లి, జూన్ 26: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం భరత్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిట్యాల దేవేంద్ర, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగెల రాజు, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎడ్ల తిరుపతి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు.ఈ సందర్భంగా యూత్ నాయకులు చిట్యాల భాను, గ్రామశాఖ అధ్యక్షులు నాగరాజు, నరేష్, శిరీషతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రొసీడింగ్స్ అందుకున్న లబ్ధిదారులు పిట్లా శ్వేత, చిట్యాల రేణుక, దోగ్గల వజ్రవ్వ మాట్లాడుతూ తమకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమ కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.






