ఏడాది మొత్తంలో ఆరుద్ర కార్తెలో మాత్రమే ఆరుద్ర పురుగులు దర్శనమిస్తుంటాయి
20-05-2024 02:17 AM
మంథని, మే19 (విజయక్రాంతి) : ఏడాది మొత్తంలో ఆరుద్ర కార్తెలో మాత్రమే ఆరుద్ర పురుగులు దర్శనమిస్తుంటాయి. ఈ ఏడాదిలో పెద్దపల్లి జిల్లా మంథనిలో ముందుగానే ఆరుద్ర పురుగు కనిపించింది. వీటి రాకను రైతులు శుభ సూచికంగా భావిస్తుంటారు. ఆదివారం మంథనిలో ఆ పురుగులు దర్శనమిచ్చాయి. ఇంకా రోహిణి కార్తె రాక ముందే ఆరుద్ర పురుగులు రావడం అందరినీ ఆశ్యర్యపరించింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






