30 August, 2026 | 4:12 PM

తాళం వేసిన ఇంట్లో చోరీ

20-05-2024 02:16 AM

రూ.5 లక్షలు అపహరణ

జనగామ, మే 19 (విజయక్రాంతి): తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన జనగామ పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ రఘుపతిరెడ్డి తెలి పిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గ్రెయిన్ మార్కెట్ ఏరియాలో నివాసముంటున్న గొల్లపల్లి వెంకటేశ్ తన భార్యకు చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తీసుకె ళ్లాడు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో దాచిన రూ.5 లక్షల నగదు, 4 తులాల బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు.