భద్రాద్రి ఎస్పీ డ్యాన్స్
20-05-2024 02:19 AM
భద్రాద్రి కొత్తగూడెం, మే 19 (విజయక్రాంతి) : నిత్యం తనిఖీలు, కేసుల వేటలో బిజీగా ఉండే పోలీసులు ఆదివారం కాస్త రిలాక్స్ అయ్యారు. మావో యిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల బందోబస్తును విజయవం తంగా నిర్వహించిన సందర్భంగా పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆటవిడుపుగా సమయం గడిపారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నృత్యం చేస్తుండగా వారితో కలిసి ఎస్పీ రోహిత్‌రాజు డ్యాన్స్ చేసి ఉత్సాహపరిచారు.






