మున్సిపల్ పాలకవర్గానికి ఆర్యవైశ్య యువజన సంఘం ఘన సన్మానం
హుజరాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పట్టణంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ, పాలకవర్గానికి శుక్రవారంఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
యువజన సంఘం అధ్యక్షుడు తంగళ్ళపల్లి శ్యామ్ కిషోర్, హుజూరాబాద్ నియోజకవర్గ యూత్ నాయకుడు దేవునూరి వినయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లుగా గెలిచిన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు చందా రాజు, బచ్చు మాధవి శివశంకర్‌తో పాటు ఇతర కౌన్సిలర్లు దిడ్డి రామ్, చింతల శ్రీనివాస్, కొలుగూరి సురేష్, గుర్రం కావ్య పరశురామ్‌లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రజల ఆశయాలను నెరవేర్చేలా సేవ చేయాలని, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు తమపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు అయిత మహేష్, లెంక్కలపెల్లి శరత్ కుమార్, యంసాని సురేష్, భూపతి సంతోష్ యాద శ్రీధర్ తదితరులు మరియు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




