21 March, 2026 | 8:16 AM

క్రేజీ కల్యాణంలో ఉదయ్‌గా..

21-03-2026 12:00 AM

నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘క్రేజీ కల్యాణం’. భద్రప్ప గాజుల దర్శకత్వం లో ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీ నుంచి యంగ్ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి నటించిన ఉదయ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో అఖిల్ రాజ్ సంప్రదాయ దుస్తుల్లో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించి, ఆకట్టుకున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, చైతన్యప్రసాద్ గీత సాహిత్యం అందిస్తున్నారు. శ్యామ్ దూపాటి డీవోపీగా, సాయి కదిర ఆర్ట్ డైరెక్టర్‌గా, శ్రావణ్ కటికనేని ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.