24 June, 2026 | 10:47 AM

డాక్టర్ కేతనకు నివాళులర్పించిన గ్రామ కాంగ్రెస్ నాయకులు

24-06-2026 09:40 AM

మధిర,జూన్23(విజయ క్రాంతి): మధిర మండలం మునగాల (కృష్ణాపురం) గ్రామంలోని పెరుమాళ్ళపల్లి కృపాకర్ (లేట్) కుమారుడు డాక్టర్ పెరుమాళ్ళపల్లి కేతన్ హైదరాబాద్ లో మంగళవారం గుండెపోటుతో మరణించారు. గ్రామంలోని వారి నివాసంలో మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించిన గ్రామ కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కృష్ణాపురం మాజీ సర్పంచ్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, కృష్ణాపురం గ్రామ సర్పంచ్ భూక్య నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ భూక్య నారాయణ, ఉప సర్పంచ్ కొత్తపల్లి నరసింహారావు, వేల్పుల చెంచయ్య మార్కెట్ డైరెక్టర్, గ్రామ శాఖ అధ్యక్షుడు పోచపల్లి శంకర్రావు, పోచపల్లి సత్యనారాయణలతో పాటు గ్రామ ప్రజలు పాల్గొని డాక్టర్ కేతన్ పెరుమాళ్ళపల్లి మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.