12 June, 2026 | 3:10 AM

ఆశా, ఆరోగ్య కార్యకర్తలు మెరుగైన సేవలందించాలి

12-06-2026 01:52 AM

డీఎంహెచ్‌వోడా. తుకారాం రాథోడ్

మణుగూరు, జూన్ 11(విజయక్రాంతి): గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆశా, ఆరోగ్య కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని, వారు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి మెరుగైన సేవలు అందించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (డీఎంహెచ్వో) డా. తుకారాం రాథోడ్ సూచించారు.

గురువారం మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణ, కుటుంబ నియంత్రణ, అధిక ప్రమాద గర్భిణుల గుర్తింపు, సీజనల్ వ్యాధుల నివారణ వంటి అంశాలపై ఆశా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య పథకాలను అర్హులైన వారికి చేరవేయాలని సూచించారు.

పల్స్ పోలియో, స్టాప్ డయేరియా క్యాంపెయిన్, హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఆశా కార్యక ర్తలు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నా రు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, పరిశుభ్రత, సురక్షిత తాగునీటి వినియో గంపై అవగాహన కల్పించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డా. ప్రతాప్, డా. హరీష్, ఆరోగ్య సిబ్బం ది, ఆశా కార్యకర్తలు ఇతర అధికారులు పాల్గొన్నారు.