21 March, 2026 | 10:51 AM

మంత్రి జూపల్లి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఆశా వర్కర్లు

21-03-2026 12:07 AM

కొల్లాపూర్ టౌన్ , మార్చి 20: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాంత ఆశా వర్కర్లు శుక్రవారం కొల్లాపూర్ పట్టణంలోని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. రూ.18,000 వేతనం, పీఎఫ్, పెం డింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశా రు. హామీలు అమలు చేయలేదని ఆరోపి స్తూ, సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 28న అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. వారికి మద్దతుగా సిఐటియు, టిఆర్పి పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.