ఎంపీ ఈటల రాజేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
21-03-2026 12:08 AM
తెలియజేసిన కౌన్సిలర్ వచ్‌పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్
మేడ్చల్ అర్బన్, మార్చి 20(విజయక్రాంతి): మల్కాజిగిరి బిజెపి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కు ఎల్లంపేట్ మున్సిపల్ కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. ఈటెల రాజేందర్ నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు అర్చన శ్రీనివాస్ తెలిపారు.
అనంతరం మల్కాజిగిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎల్లంపేట్ బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.




