6 June, 2026 | 9:54 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

అసెంబ్లీ నేటికి వాయిదా

29-03-2026 12:00 AM
  1. పలు పద్దులకు ఆమోదం
  2. నేడు అప్రోప్రియేషన్ బిల్లుపై చర్చ

హైదరాబాద్, మార్చి 28(విజయక్రాంతి ): శాసనసభ సమావేశాలు ఆసక్తికరమైన చర్చల మధ్య కొనసాగాయి. 2026- -27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రతిపాదించిన వివిధ శాఖల బడ్జెట్ కేటా యింపులపై అధికార, ప్రతిపక్ష సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు.  వివిధ ప్రభుత్వ శా ఖలకు సంబంధించిన బడ్జెట్ పద్దులపై సభలో జరిగిన చర్చ శనివారం ముగియడం తో పాటు శాసన సభ అమోదం తెలిపింది.

సభ్యులు అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన అం శాలకు సంబంధిత మంత్రులు వివరణలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పను లకు కేటాయించిన నిధుల వినియోగంపై చర్చ జరిగింది. పద్దులపై చర్చ పూర్తి కావ డంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటిం చారు. షెడ్యూల్ ప్రకారం, ఆదివారం సభలో అప్రోప్రియేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ఈ బిల్లు ఆమోదం పొందితేనే ప్రభుత్వం బడ్జెట్ నిధులను వెచ్చించేందుకు పూర్తిస్థాయిలో అనుమతి లభిస్తుంది.