అసెంబ్లీ సాక్షిగా సీఎం పచ్చి అబద్ధాలు
- సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్
- అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి) : అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని సీఎం చెప్పడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం అసెంబ్లీలో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. మం త్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భార్య, కొడు కు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు.
రాఘవ అనేది స్వయానా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు అని, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసు అన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ డ్రైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీ మణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ము డు ప్రసాద్ రెడ్డే అని వెల్లడించారు. అసెంబ్లీని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టించా రని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో కాంగ్రె స్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నదని మండిపడ్డారు. రా ఘవ కన్‌స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్ర భుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు. జవాబుదారీతనం లే కుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తు న్న కాంగ్రెస్ తీరు శోచనీయమన్నారు.




