హైదరాబాద్‌లో అస్సోచమ్
10వ స్మార్ట్ డేటాసెంటర్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): ‘యాక్సలేరెటింగ్ తెలంగాణ పవరింగ్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ త్రో డేటా సెంట ర్స్, ఏఐ అండ్ క్లౌడ్ (అస్సోచమ్)అనే థీమ్ తో 10వ స్మార్ట్ డేటాసెంటర్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2026ను హైదరాబాద్‌లోని హోటల్ ట్రైడెంట్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల కమిషనర్, డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి జె హాజరై మాట్లాడారు. రాష్ట్ర డేటా సెంటర్ ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక విజన్ 2047 అభివృద్ధి కార్యాచరణను వేగవంతం చేయడానికి గ్లోబ ల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమల నాయకులను భాగస్వామ్యానికి ఆహ్వానించారు. తెలంగాణలో డేటా సెంటర్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అనుకూలంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతు లు, విశ్వసనీయ విద్యుత్ సరఫరా, స్థిరమైన జల వనరులు, బలమైన ఆవిష్కరణ ఎకోసిస్టమ్‌ను సృష్టించేందుకు కట్టుబడి ఉన్నామ ని చెప్పారు.
ఈ సమ్మిట్లో విధాన నిర్ణేతలు, పరిశ్రమల నాయకులు, సాంకేతిక నిపుణు లు, సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొని భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు, ఏఐ ఆధారిత మౌలిక వసతులు, క్లౌడ్ స్వీకరణ, సస్టైనబిలిటీ, నైపుణ్యాభివృద్ధి అంశా లపై చర్చించారు. డాక్టర్ లవ్నీష్ చనానా, ఎస్‌ఏపీ ఏసీయా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ గవర్నమెంట్ అఫైర్స్ (ఆసియా పసిఫిక్) మాట్లాడుతూ.. పరిశ్రమ అంతటా ‘సాఫ్ట్వేర్ ఒక సాధనం’ నుంచి ‘సాఫ్ట్వేర్ ఒక సహచరుడు’గా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ కొత్త ఏఐ సహచరుడిని సురక్షితంగా, స్థిరంగా భారీ స్థాయిలో హోస్ట్ చేయగల రాష్ట్రాలు, డేటా సెంటర్లు వచ్చే ద శాబ్దపు వృద్ధిలో అధిక భాగస్వామ్యాన్ని సా ధిస్తాయి. తెలంగాణ వంటి రాష్ట్రాలు దీనికి నాయకత్వం వహించే స్థితిలో ఉన్నాయి అన్నారు. అస్సోచమ్ డేటా సెంటర్ కౌన్సిల్ కో-చైర్, ఎస్‌టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ చీఫ్ సేల్స్, మార్కెటింగ్ ఆఫీసర్ జతీందర్ సింగ్ పాబ్లా మాట్లాడుతూ.. ఏఐ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఆధారిత ఆటోమేషన్ నుంచి స్వయం నియంత్రిత సంస్థల వరకు ఐదు దశల ప్రయాణంలో అభివృద్ధి చెందుతోంది.
భారత్ ప్రస్తుతం భారీ స్థాయి ఏఐ డిమాండ్తో మూడో దశలోకి ప్రవేశిస్తోంది. తెలంగాణ స్పష్టమైన విధానాలు, డిజిటల్ మౌలిక వసతుల సిద్ధత డేటా సెంటర్ వృద్ధికి నాయకత్వం వహించే స్థాయిలో ఉన్నాయి అని అన్నారు. కార్యక్రమంలో టెక్నో డిజిటల్ అధ్యక్షుడు అమిత్ అగర్వాల్, అదానీకనెక్స్ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సన్నీ తథేలే, సైఫై ఇన్‌ఫినైట్ స్పేసేస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శరద్ అగర్వాల్, సీటీఆర్‌ఎల్‌ఎస్ సీఐఎస్‌వో డైరెక్టర్ కాంప్లియెన్స్ చంద్ర శేఖర్ శర్మ గరిమెల, అస్సోచమ్ తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ కో-చైర్ రాంబాబు బూరుగు, తెలంగాణ ప్రభుత్వ ఎనర్జీ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, అస్సోచమ్ సెక్రటరీ జనరల్ కల్నల్ సౌరభ్ సన్యాల్ మాట్లాడారు.






