15 July, 2026 | 6:40 AM

ఏకకాలంలో ఓజీ, గేమ్ చేంజర్..

19-06-2024 12:05 AM

సంగీత దర్శకుడు థమన్ మళ్ళీ సరిగమలతో కుస్తీ పడుతున్నారు. తాజాగా ‘ది స్పైస్ టూర్’ పేరిట సంగీత పర్యటనని ముగించుకొచ్చిన ఆయన, తాను చేయనున్న సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్  సుజిత్ కలయికలో రానున్న ‘ఓజీ’, శంకర్ చరణ్‌ల ‘గేమ్ చేంజర్’ పనులను ఆయన పూర్తి చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.

‘గేమ్ చేంజర్’ చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతోపాటు, ‘ఓజీ’కి సినిమాకి సైతం కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నందున థమన్ ఈ రెండు సినిమా పనుల్ని వేగవంతం చేస్తున్నారట. ఈ రెండు సినిమాల పనులు ఏకకాలంలో జరుగుతుండటం.. ఎంతోకాలంగా రామ్ చరణ్, పవన్ లను తెరపై చూడాలనుకుంటున్న మెగాభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. వీటితోపాటు ‘ఎన్.బి.కె. 109’, ‘తెలుసు కదా’ తదితర చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు తమన్.