17 July, 2026 | 7:47 PM

ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం

17-07-2026 07:47 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఏఏఎం కేంద్రాన్ని నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్  అంచనా ప్రక్రియలో భాగంగా జిల్లా వైద్యాధికారుల బృందం శుక్రవారం సందర్శించింది.ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో నర్సింగ్ చౌహాన్,జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు,సీహెచ్‌వో ఠాగూర్ కేంద్రాన్ని పరిశీలించి, ఎన్.క్యూ.ఏ.ఎస్  అంచనాకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, నాణ్యత ప్రమాణాల అమలుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

అనంతరం మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్,జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ రాము,జిల్లా క్వాలిటీ మెంటర్ అసిస్టెంట్ చైతన్య, ఎం.ఎల్‌.హెచ్‌.పీ రాశి తదితరులు పాల్గొన్నారు.ఇటీవల జరిగిన ఈ-అసెస్‌మెంట్‌ను కేంద్ర బృందం అభినందిస్తూ,సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు కొన్ని సూచనలు చేసినట్లు మండల వైద్యాధికారి సృజన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.