17 July, 2026 | 7:40 PM

కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

17-07-2026 07:40 PM

344 కోట్ల రూపాయలను  మహిళలకు వడ్డీ లేని రుణాలు 

డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య 

తుంగతుర్తి (విజయ క్రాంతి): రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య అన్నారు, శుక్రవారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో మహిళా శక్తి భవనానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలను ఆర్థికంగా, పరుపుష్టం చేయడంలో రకరకాలుగా అవకాశం కల్పించడమే కాక కొన్ని ప్రత్యేక కార్యక్రమాలలో వారికి ఎక్కువ ప్రాధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. అందులో భాగంగానే ఈరోజు వెలుగు పల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో ఇందిరా శక్తి భవనానికి భూమి పూజ చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో ఉండి రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ప్రత్యేకంగా కోరారు.