26 May, 2026 | 6:15 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

బిల్ కలెక్టర్‌పై దాడి

14-12-2024 12:27 AM

అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 13: నిబంధనలు మేరకు పనులు చేయాలని చెప్పినందుకు గాను బిల్ కలెక్టర్ (కారోబార్)పై మాజీ సర్పంచ్ దాడి చేసిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, గండిచెరువు గ్రామ పరిధిలోని విష్ణుప్రియ, శివప్రియ వెంచర్ లో ఉన్న ఒక వివాదస్పద స్థలంలో బోరు వేస్తున్నారని గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి సమాచారం అందించడంతో బిల్ కలెక్టర్ అనుపట్టి గిరీశ్, వాటర్‌మెన్లతో కలిసి వెళ్లగా.. అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ జక్కా పాపిరెడ్డి, మరో వ్యక్తి జక్కా ధీరజ్‌రెడ్డి వారిపై దాడిచేశారు. ఈ విషయంపై బాధితుడు పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.