దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం
రామయంపేట, (విజయకాంత్రి): రామాయంపేట మండల కేంద్రంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లాలో ఆయా సంఘాల బాధ్యులు హాజరై బాధితుల సమస్యలను విని సంబంధిత పత్రాలను పరిశీలించడం జరిగింది. ఈ మేరకు బాధితులు వారికున్న సమస్యలతో పాటు దరఖాస్తు ఫారాలు సంబంధిత రికార్డులను దళిత సంఘాలకు పెద్దలకు అప్పగిస్తూ సమస్యల పరిష్కార దిశగా న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ బాధిత దరఖాస్తులలో భూమి హాస్పిటల్ గ్రామపంచాయతీ ప్రైవేటు ప్లాట్ల సమస్యలు రాగా ఈ సమస్యల పరిష్కారానికి దళిత సంఘాల జేఏసీగా అందరం కలిసికట్టుగా ఉండి సమస్యల సాధన కోసం సమస్యల పరిష్కారం కోసం పనిచేసి బాధితులు ఆదుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘాల బాధ్యులు పాతూరి రాజు, దుబాసి సంజీవ్, ఉషన్న గారి మురళి, మాసాయిపేట మల్లేశం, శ్యామల అశోక్, లద్ద నర్సింలు, దండోల్ల సామెల్, సిద్ధ రాములు తదితర బాధితులు పాల్గొన్నారు






